సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్. ఈ సినిమాలో పూజా హెగ్డే నాయికగా నటిస్తున్నారు. వెంకటేష్ కీలక పాత్రలో కనిపిస్తారు. స్పెషల్ సాంగ్ చేయడానికి రీసెంట్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రామ్‌చరణ్.
చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌లో కీ రోల్ చేశారు సల్మాన్ ఖాన్. అలాగే షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్‌లో కూడా ఆయన కేరక్టర్ చాలా స్పెషల్‌గా అనిపించింది. ఈ రెండు చిత్రాల్లోనూ అతిథి పాత్రల్లో మెరిసిన భాయీజాన్ నుంచి ఫుల్‌ప్లెడ్జ్ డ్ మూవీ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. చాన్నాళ్లుగా సెట్స్ మీదున్న కిసీ కా భాయ్ కీసీ కీ జాన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ సినిమా నుంచి టీజర్‌తో పాటు రెండు పాటలు కూడా విడుదలయ్యాయి. ఈ పాటలకు మంచి స్పందన వస్తోంది.
సల్మాన్‌ఖాన్ ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించని గెటప్‌లో ఉన్నారంటూ కితాబులందుతున్నాయి. ఈ నేపథ్యంలో కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా ప్లాట్ గురించి కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో నేరం లేని సమాజాన్ని చూడాలనుకునే వ్యక్తిగా కనిపిస్తారట సల్మాన్‌ఖాన్. ఆయనకు నలుగురు తమ్ముళ్లుంటారట. సల్మాన్ వారందరిలోకీ పెద్దవారట. అమ్మాయిలంటే అసలు పడని కేరక్టర్‌లో నటిస్తున్నారు.
ఆడవారి మీద సల్మాన్‌కి అంత ద్వేషం రావడానికి కారణం అతని ప్రీవియస్ లవ్వేనట. ఆ విషయం తెలుసుకున్న సోదరులు అచ్చం అలాంటి అమ్మాయినే తీసుకొచ్చి, సల్మాన్ తో ప్రేమాయణం ఎపిసోడ్ కొనసాగిస్తారట. కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్నీ హంగులూ ఇందులో ఉన్నాయన్నది మేకర్స్ చెబుతున్నమాట. నార్త్ కల్చర్, సౌత్ కల్చర్‌కి ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమా తెరకెక్కించారట. నటీనటుల్ని కూడా అదే విధంగా ఎంపిక చేశారని సమాచారం.
సల్మాన్ నటిస్తున్న మరో సినిమా టైగర్ 3. ఇందులో కత్రినా కైఫ్ నాయికగా నటిస్తున్నారు. టైగర్ 3లో షారుఖ్ కూడా కనిపిస్తారు.